రేపటినుండి తూప్రాన్ లో రేణుక ఎల్లమ్మ మాత 13వ వార్షికోత్సవ వేడుకలు..

రేపటినుండి తూప్రాన్ లో రేణుక ఎల్లమ్మ మాత 13వ వార్షికోత్సవ వేడుకలు..

మూడు రోజులపాటు ఉత్సవాలు..

 

ఉత్సవాలకు ముస్తాబైన దేవాలయాలు...

 

ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 17 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో గౌడ సంఘం తూప్రాన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ మాత దేవాలయ 13వ వార్షికోత్సవ వేడుకలను ఈనెల ఆదివారం 19 నుండి 21 తేదీ మంగళవారం వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గౌడ సంఘం సభ్యులు తెలిపారు 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు పోచమ్మకు బోనాలు 20వ తేదీ సోమవారం ఉదయం అమ్మవారి అభిషేకం దర్శనం ఉదయం 11 గంటలకు 1, కుంకుమార్చన అన్న ప్రసాద వితరణ గౌడ్ ల ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతాలు 21వ తేదీ మంగళవారం రేణుక ఎల్లమ్మ కళ్యాణం సాయంత్రం 6 గంటలకు రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పణ విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. తూప్రాన్ మండలంలోని గౌడ సోదరులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని తెలిపారు.. ఉత్సవాల కోసం యాగ శాల నిర్మాణం గత పది రోజులుగా అమ్మవారి దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.. లైటింగ్ సౌండ్ శమియానా లతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Latest News

రేపటినుండి తూప్రాన్ లో రేణుక ఎల్లమ్మ మాత 13వ వార్షికోత్సవ వేడుకలు.. రేపటినుండి తూప్రాన్ లో రేణుక ఎల్లమ్మ మాత 13వ వార్షికోత్సవ వేడుకలు..
మూడు రోజులపాటు ఉత్సవాలు..   ఉత్సవాలకు ముస్తాబైన దేవాలయాలు...   ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 17  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో గౌడ సంఘం తూప్రాన్...
మాదిగలకు 11% రిజర్వేషన్లు పెంచాల్సిందే......
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన.....
తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తాం...
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం.....
మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం......
ఎఫ్ టి ఎల్ గుర్తించేందుకు సర్వే నిర్వహించిన అధికారులు...