తడ్కపల్లి గ్రామం లో అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

 తడ్కపల్లి గ్రామం లో అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

 

 

ప్రజాస్వరం , సిద్ధిపేట 

 

మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు  రాష్ట్ర ప్రజలందరికి డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు.తే;లిపారు. గ్రామంలో ఎన్నో ఎళ్లుగా ఉన్న లోటు నేటితో తీరిపోయినట్లయిందని  తడకపల్లిలో అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. .ఇచ్చిన మాట ప్రకారం సాయి ఆయన కుమారుడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుచేసినందుకు వారిని అభినందిస్తున్నానని .గ్రామం మొదటిలోనే అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎవరు గ్రామానికి వచ్చిన మొదట ఆహ్వానం పలికేది అంబేద్కర్ అంబేద్కర్ స్ఫూర్తిని రగిలించే విధంగా గ్రామంలో ఆయన జయంతి రోజున విగ్రహాం ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషం.కొంతమంది అనుకున్నట్లు అంబేద్కర్  కేవలం ఒక వర్గానికి మాత్రమే నాయకుడు కాదు,ఆయన  అందరివాడు అని అన్నారు. భారతదేశం ప్రపంచంలో అదిపెద్ద ప్రజా స్వామ్య దేశంగా ఎదుగుతుంది అంటే అది అంబేద్కర్ రచించిన స్పూర్తి అని అమెరికాలాంటి దేశంలోనే మహిళలకు ఓటు హక్కు రావాలంటే దశాబ్దాల కాలం పట్టింది కానీ మన దేశానికి స్వతంత్ర్యం వచ్చిన వెంటనే..రాజ్యాంగం ద్వారా ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి బాబాసహేబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.నేటి యువత అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకోవాలి..పేదరికం అనేది చదవుకోవడానికి అడ్డు రాకోడదని అంబేద్కర్ మార్గాన్ని  చూసి నేర్చుకోవాలన్నారు. అంబేద్కర్ మంచి జీవితం అనుభవించాలంటే..విదేశాల్లో ఎక్కడైనా స్థిరపడేవారు కానీ దేశంలోని అణగారిన వర్గాల కోసం పోరాడి విజయం సాధించిన మహోన్నతవ్యక్తి అంబేద్కర్. అలాంటి గొప్ప వ్యక్తి ఆశయాలను రాష్ట్రంలో ముందుకు తీసుకుపోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అలివికానీ హామీలు ఇచ్చి,గదెనెక్కి, ఏమిచేయలేక చేతులు ముడుచుకుని కూర్చుంది.చదవుకున్న పిల్లలకు 10వ తరగతి పాస్ అయితే రూ.10వేలు, ఇంటర్ పాస్ అయితే రూ.25 వేలు, డిగ్రీ పాస్ అయితే రూ.1లక్ష, పీజీ పాస్ అయితే రూ.2 లక్షలు ఇస్తామని చెప్పి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను నమ్మించి మోసం చేశారు.ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు రాకా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులకు ఒక్క రూపాయికూడా ఇవ్వంలేదు.ఆనాడు కేసీఆర్ ఒక్కో విద్యార్థికి  రూ.20లక్షలు ఇచ్చి విదేశాల్లో చదివించారు.దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే..సచివాలయానికి అంబేద్కర్ పేరుపెట్టిన ఒకేఒక్క నాయకుడు మన కేసీఆర్.ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున్న కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటుచేస్తే..ఇది కేసీఆర్ పెట్టించుండు అని రేవంత్ రెడ్డి దానికి తాళం వేపించి పెట్టిండు.కనీసం అంబేద్కర్ కు దండ కూడా వేయని సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి.ఇప్పటికైన కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం యువత ఆన్‌లైన్ గేమ్ ఆడి జీవితాలు నశనం చేసుకోవద్దు. బెట్టింగులు ఆడి డబ్బులు వృదా చేసుకోవద్దు.డ్రగ్స్, మత్తుపదర్థాలకు వ్యసనాలుకు భానిసలు కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించిన బాటలో ముందుకు సాగాలన్నారు. 

Latest News

పశువుల తరలిస్తున్న డీసీఎం ను పట్టుకున్న పోలీస్ లు .... పశువుల తరలిస్తున్న డీసీఎం ను పట్టుకున్న పోలీస్ లు ....
ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 18  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో NH44 పై టోల్ గేట్ సమీపంలో ఎద్దులను డీసీఎం వాహనంలో...
రేపటినుండి తూప్రాన్ లో రేణుక ఎల్లమ్మ మాత 13వ వార్షికోత్సవ వేడుకలు..
మాదిగలకు 11% రిజర్వేషన్లు పెంచాల్సిందే......
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన.....
తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తాం...
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం.....
మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం......