మాదిగలకు 11% రిజర్వేషన్లు పెంచాల్సిందే......

ఎం ఆర్ పి ఎస్ డిమాండ్.....

మాదిగలకు 11% రిజర్వేషన్లు పెంచాల్సిందే......

ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 17 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తెలంగాణ రాష్ట్రంలో జనాభా కనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని తూప్రాన్ లో మీడియా సమావేశం లో ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. తూప్రాన్ లో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు యాదగిరి మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ గతం నుండి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ 9% కాదు 11% పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సామాజిక ఉద్యమాన్ని ఉధృతం చేసి వర్గీకరణ సాధించుకుందాం అనిఆయన అన్నారు .ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ గతంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా మాదిగలదని జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు కానీ ప్రభుత్వం తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎస్సీలను వర్గీకరించింది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే కుల గణనా సర్వే నిర్వహించిన సర్వేలో మాదిగల జనాభా అత్యధికంగా ఉందని ప్రభుత్వమే లెక్కలు తేల్చిందని దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని మరొక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం మాకు జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ కేటాయిస్తేనే న్యాయం జరుగుతుందని లేనిపక్షంలో మా జాతికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నాం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా శాతాన్ని పెంచి న్యాయం చేయాలని లేని పక్షంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరోసారి ఉద్యమించక తప్పదని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు ఉషన్న గళ్ళ మురళీ మాదిగ మాదిగ జిల్లా అధికార ప్రతినిధి తాడపు మహేందర్ మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పల్లె పాటి మాధవి మాదిగ ఢిల్లీ పుష్ప మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సర్గాల నర్సింలు మాదిగ శివొళ్ల భాస్కర్ మాదిగ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Latest News

రేపటినుండి తూప్రాన్ లో రేణుక ఎల్లమ్మ మాత 13వ వార్షికోత్సవ వేడుకలు.. రేపటినుండి తూప్రాన్ లో రేణుక ఎల్లమ్మ మాత 13వ వార్షికోత్సవ వేడుకలు..
మూడు రోజులపాటు ఉత్సవాలు..   ఉత్సవాలకు ముస్తాబైన దేవాలయాలు...   ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 17  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో గౌడ సంఘం తూప్రాన్...
మాదిగలకు 11% రిజర్వేషన్లు పెంచాల్సిందే......
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన.....
తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తాం...
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం.....
మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం......
ఎఫ్ టి ఎల్ గుర్తించేందుకు సర్వే నిర్వహించిన అధికారులు...