మల్కాపూర్ లో స్వచ్చా భారత్.... 

మల్కాపూర్ లో స్వచ్చా భారత్.... 

ప్రజాస్వరం  : తూప్రాన్ ,ఏప్రిల్ 19 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 397వ ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. 4వ వార్డులో పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ ను, చెత్తాచెదారాన్ని తొలగించారు. సిసి రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరచారు. గ్రామం శుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యం తో ఉంటారని ఆయన అన్నారు గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, జిన్న కృష్ణ, వేణుగోపాల్ , తిరుపతి, అంగన్వాడి టీచర్లు స్వర్ణలత, లావణ్య, వివో ఏ సంతోష, ఆశ వర్కర్ ఇందిరా,మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.