మల్కాపూర్ లో అంబేద్కర్ జయంతి.... 

మల్కాపూర్ లో అంబేద్కర్ జయంతి.... 

తూప్రాన్ ,ఏప్రిల్ 14 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను అంబేద్కర్ సంఘం మరియు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ అంబేద్కర్ సంఘం నాయకులు, పాలకవర్గ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.సమాజంలో అంటరానితనాన్ని, అస్పృశత ను రూపుమాపిన మహనీయుడని ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు.కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పల్లెపాటి స్వామి,పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేకిన్ యువత, అంగన్వాడి టీచర్లు, ఐకెపి వివోఏ, ఆశా వర్కర్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.