రేపటి నుంచి ఆర్టీసీ కార్మికుల నిరవదిక సమ్మె....
ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి...
టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి మేడి రాధా కిషన్ రావు..
ప్రజాస్వరం : మెదక్ ,ఏప్రిల్ 21
గత ఎన్నో ఏళ్లుగా ఆపరిష్కృతంగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి మేడి రాధా కిషన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రేపటి నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మె నేపథ్యంలో మంగళవారం మెదక్ డిపో వద్ద నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో సార్లు అజెండాలో పొందుపరచడం, విజ్ఞాపన పత్రాలతో తెలంగాణా ప్రభుత్వ, ఆర్టీసీ యజమాన్యానికి తెలియచేసినప్పటికి ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. "ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల పునరుద్ధరణ, 2021, 2025 వేతన సవరణ, 2017 పిఆర్సి బకాయిలు, రిటైర్ అయినవారికీ చెల్లించాల్సిన అన్ని బకాయిల వెంటనే చెల్లించాలన్నారు. ఈ అన్ని అంశాలను పరిశీలించి మంగళవారం మధ్యాహ్నం లోపల రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో 22 నుంచి సమ్మెకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగమేశ్వర్, కొత్త రాజు, పడిగి నరసింహులు, ప్రభుకుమార్, రుక్మయ్య, స్వప్న, విమల, సందీప, నాగరాణి, కృష్ణ, వినీలా, ఎమ్ఎస్ నారాయణ, భాగ్యమ్మ, భిక్షపతి, యాదయ్య, సత్యశ్చంద్ర, ఇజాజ్ తదితరులు పాల్గొన్నారు.


