దేశ అభివృద్ధి కి మహిళా పాత్ర ముఖ్యం...
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా మీడియా ఇంచార్జీ చీకోటి ప్రవీణ్ కుమార్....
మహిళ బిల్లు పై కాంగ్రెస్ వక్ర బుద్ధి....
హైడ్రా పేరు తో పేదలను భయభ్రాంతులు...
మహిళ రిజర్వేషన్ కు డిల్మిటేషన్ కు లింక్ లేదు....
ప్రజాస్వరం : మెదక్ ,ఏప్రిల్ 21
ఏ దేశమైన అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ముఖ్యమని, మహిళ రిజర్వేషన్ బిల్లు కు బీజేపీ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా మీడియా ఇంచార్జీ చీకోటి ప్రవీణ్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా మీడియా ఇంచార్జీ చీకోటి ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. మోడీ భారతదేశం అభివృద్ధి చెందాలని మహిళా లకు 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని రిజర్వేషన్ బిల్లు పెట్టడం జరిగిందని, ఆ బిల్లు ఆమోదం కాకపోవడం తో ఆరోజున బ్లాక్ డే గా పరిగణిస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కు కాంగ్రెస్, ఇండియా కూటమి అడ్డు చెప్పి తమ వక్రబుద్ధి బయట పడిందని అన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లు వల్ల సౌత్ ఇండియా కు ఎలాంటి అన్యాయం జరగదని, ఎక్కువ సీట్లు డిలిమిటేషన్ బిల్లు కు మహిళ బిల్లు కు లింక్ పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ పని చేయాలన్నా కమిషన్ ఇస్తేనే పనులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో హైడ్రా పేరు తో పేదలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందని, ఈ హైడ్రా ద్వారా పెద్దోళ్ల ఇల్లు ఎక్కడ కూల్చడం లేదని మరి ముఖ్యంగా ఓవైసీ కి సంబంధించిన ఫాతిమా కళాశాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. గత పది ఏళ్లలో కెసిఆర్ ఎలా అయితే మాటలతో మభ్యపెట్టి ఎలా అయితే దోచుకున్నారో ఈ ఐదేళ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మభ్య పెట్టీ దోచుకునే ప్రయత్నం చేస్తారే తప్ప అభివృద్ధి జరగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లపై దృష్టి సారించాలని అన్నారు. మహిళలు ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ చేసిన దురాలోచన లను మహిళ ల పట్ల చూస్తున్న చిన్న చూపును ప్రతి ఒక్క మహిళ గమనించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, మహిళ మోర్చా నాయకురాలు మల్లికా, సర్పంచ్ లు బెండ వీణ, శైలజ, కౌన్సిలర్ లు పబ్బ రాజమణి, శంకర్, జిల్లా కార్యదర్శి మహేశ్వరి, మీడియా ఇంచార్జీ సంగీత, మౌనిక, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, నాయకులు లావణ్య, రాములు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


