ప్రతి పేదోడి సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ పార్టీ..

చెరుకు శ్రీనివాస్ రెడ్డి.....

ప్రతి పేదోడి సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ పార్టీ..

ప్రజాస్వరం : నార్సింగి ,ఏప్రిల్ 21

 

ప్రతీ పేదోడి స్వంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల పరిధి లోని నర్సంపల్లి కు చెందిన వట్టెపు సిద్ధిరాములుకు మంజూరు అయి గ్రామంలో నిర్మాణం పూర్తి అయిన తొలి ఇందిరమ్మ ఇంటికి సోమవారం నిర్వహించిన గృహ ప్రవేశ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరుకు మాట్లాడుతూ లబ్ధిదారుడు స్వీయ పర్యవేక్షణ లోనే తన ఇంటి నిర్మాణం జరిగేలా నేరుగా లబ్ధిదారుకే ఐదు లక్షలు ఇస్తున్నామని అన్నారు. 2029 వరకు స్వంత ఇల్లు లేని పెదోడు ఉండకూడదన్న లక్ష్యం తో కాంగ్రెస్ పార్టీ నిబద్ధత తో పని చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి నిధులను సిద్దిపేట నాయకులు తరలించుకుని వెళ్లారని విమర్శించారు. గత ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కి అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కి సమానం అని, అందుకే వచ్చే మరో పది ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ కి అధికారంలో ఉంచడం ప్రజల బాధ్యత అని అన్నారు. గృహప్రవేశం చేస్తున్న పరివారానికి శాలువాతో సన్మానించి చెరుకు శుభాకాంక్షలు తెలిపారు. తమ స్వంత ఇంటి కల నెరవేర్చినందుకు సిద్ధిరాములు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహాయం అందించిన చెరుకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపల్లి సర్పంచ్ కొండాపురం భాగ్యలక్ష్మి రాజేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్ బొమ్మగారి ప్రభాకర్, పార్టీ గ్రామ అధ్యక్షులు అన్వర్ నార్సింగి ఉప సర్పంచ్ రాజేందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు అంచనూరి రాజేష్, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, మైనారిటీ నాయకులు రఫీక్, జహీర్, సీనియర్ నాయకులు బాలరాజు గౌడ్, గోవర్ధన్, సుధాకర్, బాబగౌడ్, రాజేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.