అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం.....

పోస్టర్లు ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ నగేష్, డీఎఫ్ఓ జోజి...

14 ఏప్రిల్ నుంచి ఫైర్ సర్వీస్ వీక్....
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం.....

ఏడు రోజులు అవగాహన కార్యక్రమాలు, మాక్ డ్రిల్స్...

 

మెదక్ ,ఏప్రిల్ 14 (ప్రజాస్వరం):

 

మెదక్ జిల్లాలో అగ్ని ప్రమాదాల నివారణే లక్ష్యంగా మంగళవారం ఫైర్ సర్వీస్ వీక్ (అగ్నిమాపక వారోత్సవాలు) ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఫైర్ ఆఫీసర్ జి.వేణు ఆధ్వర్యంలో అగ్నిమాపక కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అటవీ అధికారి జోజితో కలిసి అగ్ని భద్రతకు సంబంధించిన అవగాహన పోస్టర్లు, స్టిక్కర్ల ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా పెను ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రద్దీగా ఉండే ప్రజా ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో రైతులకు, ప్రజలకు ప్రత్యక్షంగా వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం..... బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం.....
  ప్రజాస్వరం : మాసాయిపేట ,ఏప్రిల్ 14    మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మాసాయిపేట మండల అధ్యక్షుడు సమావేశంలో
నేటి యువత అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోవాలి....
అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్...
శేరిపల్లి లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు...
తహశీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి...
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం.....
మల్కాపూర్ లో అంబేద్కర్ జయంతి....