నేటి యువత అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోవాలి....
హరీష్ రావు....
ప్రజాస్వరం: సిద్దిపేట జిల్లా, ఏప్రిల్ 14
సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట మండలం బంజేరుపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికి డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ చదువుకున్న చదువుకుని మంచి జీవితాన్ని ఆయన పొందేవారు. కానీ ఆయన అలా ఆలోచించలేదు. నా చదువు నా కోసం కాదు నా దేశం కోసం నా అణగారిన వర్గాల కోసం అని ఆలోచించిన నాయకుడు అంబేద్కర్. దేశ విదేశాల్లో చదువుకొని ప్రపంచాన్ని అర్థం చేసుకొని మన రాజ్యాంగాన్ని అద్భుతంగా రచించారు . ఆయన రచించిన రాజ్యాంగం వల్ల మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్నది. అమెరికాలాంటి దేశంలోనే మహిళలకు ఓటు హక్కు రావాలంటే దశాబ్దాల కాలం పట్టింది..కానీ మన దేశానికి స్వతంత్ర్యం వచ్చిన వెంటనే..రాజ్యాంగం ద్వారా ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి బాబాసాహేబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన పెట్టిన బిక్ష వల్లే అందరూ పెద్ద పెద్ద చదువులు, ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ కల సాకారం అయ్యింది. - ఆయన ఎంతో దూర దృష్టితో ఆలోచించి కొత్త రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని రాశారు. దళితబంధు కేసీఆర్ 10 లక్షలు ఇస్తున్నాడు మేం 12 లక్షలు ఇస్తామన్నారు ఏమైంది ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లేకుండా పోయింది. పోయిన సంవత్సరం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కు 3300 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. బోధించు సమీకరించి పోరాడు ఇదే అంబేద్కర్ గారు చెప్పిన గొప్ప సిద్ధాంతం . అన్యాయాలు అక్రమాలు చేస్తున్న ప్రభుత్వాలపై పోరాడండి అని ఆయన చెప్పారు. పోరాటమే లేకపోతే తెలంగాణ వచ్చేదా..? ఏ వర్గమైనా ఏ ప్రాంతం అయినా మనకు అన్యాయం జరుగుతుందంటే గొంతు విప్పాలి. కెసిఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నేర్పించారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు ఆ విగ్రహానికి తాళం వేసిండు . నేను మొన్న లండన్ పోయినప్పుడు చూసినా అక్కడ అంబేద్కర్ నివసించిన ఇంటిని మ్యూజియం గా మార్చారు దేశ విదేశాల నుండి ఆయన మ్యూజియంలో చూడడానికి వస్తుంటారు. నేటి యువత అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోవాలి..పేదరికం అనేది చదవుకోవడానికి అడ్డు రాకూడదని అంబేద్కర్ ని చూసి నేర్చుకోవాలి. అందరికీ సమాన హక్కులు మాటల్లో కాదు.. చేతల్లో ఉంటేనే సమాజం బాగుపడుతుంది. పిల్లలను బాగా చదివించండి.. చదువు ఉంటేనే బాగుపడుతామని అన్నారు.


