శేరిపల్లి లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు...

శేరిపల్లి లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు...

ప్రజాస్వరం: నార్సింగి, ఏప్రిల్ 14 

 

అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు జంగార్ల మురళి ఆధ్వర్యంలో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సింగ్ మండలం శేరిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి అధ్యక్షుడు మురళి పూలమాలవేసి, జెండా ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ సంతోష గొండస్వామి యాదవ్ వార్డు సభ్యులు మాజీ సర్పంచ్ లు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమత వివక్ష లేకుండా శేరిపల్లి గ్రామంలో అందరూ అన్నదమ్ముల కలిసి ఉంటున్నామని వారు కొనియాడారు ఎప్పుడు కూడా కులమత బేధాలు రాకుండా అందరూ కలిసిమెలిసి ఉన్నామని తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల అంటరానితనం నిర్మూలన బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన చేకూరాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జంగర్ల మురళి, వార్డు సభ్యులు అరుణ్ యాదవ్ నవీన్ కుమార్, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షులు కందరి చిన్నబాబు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీరామ్ భరత్, మాజీ సర్పంచ్ లు తాళ్ల కృష్ణ గౌడ్, చెప్యాల మల్లేశం, మాజీ ఉపసర్పంచ్ బాలాజీ, గ్రామస్తులు లక్ష్మి నర్సింలు, చెంద్రం గౌడ్, బోయిని రమేష్, స్వామి గౌడ్, నాగరాజు, వెంకటేశం, బాను ప్రసాద్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం..... బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం.....
  ప్రజాస్వరం : మాసాయిపేట ,ఏప్రిల్ 14    మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మాసాయిపేట మండల అధ్యక్షుడు సమావేశంలో
నేటి యువత అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోవాలి....
అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్...
శేరిపల్లి లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు...
తహశీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి...
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం.....
మల్కాపూర్ లో అంబేద్కర్ జయంతి....