జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్, S.P. చేతుల మీదుగా దళిత సేవారత్న అవార్డు ప్రధానం...
తూప్రాన్ మాజీ కౌన్సిలర్ మామిడి వెంకటేష్ కు అరుదైన గౌరవం...
మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామల అశోక్
సర్గల నర్సింలు .. లకు ఘన సన్మానం
ప్రజాస్వరం, తూప్రాన్, ఏప్రిల్ 14 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహించిన షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అవార్డుల ప్రధానోత్సవం లో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ,జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా తూప్రాన్ మాజీ మున్సిపల్ రెండవ వార్డ్ కౌన్సిలర్ మామిడి వెంకటేష్ కు దళిత సేవ రత్న అవార్డును ప్రధానం చేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.. తూప్రాన్ మండల ప్రజలకు మున్సిపల్ ప్రజలకు సేవలందించిన మామిడి వెంకటేష్ కు అరుదైన గౌరవం లభించింది.. మాల మహనాడు నాయకులు సామల అశోక్ కుమార్, సర్దల నర్సింలు వీరికి కూడా జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ గారు సేవ రత్న అవార్డులను ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు అనంతరం వీరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే దళిత నాయకులను గుర్తించి ప్రభుత్వం అధికారికంగా ప్రదానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు...


