రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు....
గజ్వేల్ ఏఎంసీ చైర్మన్...
ప్రజాస్వరం : జగదేవ్ పూర్,ఏప్రిల్ 28
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు సరైన మద్దతు ధర లభిస్తుందని, కావున రైతులందరూ ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి పిలుపు నిచ్చారు.జగదేవ్‌పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ విద్యాధర్ ,ఉపసర్పంచ్ నాగరాజు మరియు ఐకేపీ సిబ్బందితో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను వాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్,మాజీ సర్పంచ్ రజిత రాజేందర్ రెడ్డి,మోహన్ రెడ్డి,ఐకేపీ సిబ్బంది మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


