మహిళ హత్యకేసులో నిందితులు అరెస్టు...

మహిళ హత్యకేసులో నిందితులు అరెస్టు...

ప్రజాస్వరం : గుంటూరు , ఏప్రిల్ 15 

 

మహిళా మిస్సింగ్ కేసు లో పోలీస్ దర్యాప్తులో హత్య జరిగినట్లుగా నిర్ధారణ అయింది. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పాత గుంటూరు యాదవ బజారు లో నివాసం ఉండే వెంకాయమ్మ తన చిన్న కూతురు రమాదేవి కనపడట్లేదు అనీ పాత గుంటూరు పోలీసులకు పిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పాత గుంటూరు పోలీసులు సంఘం జాగర్లమూడి కాలువలో మహిళా మృతదేహం ఉంది అన్న సమాచారంతో అక్కడి వెళ్లారు. మృతురాలు పాత గుంటూరులో మిస్సింగ్ అయిన ఆకుల రమాదేవిగా గుర్తించారు. ఆకుల రమాదేవి భర్త శ్రీనివాస్ చనీపోవడంతో ఎనముల సురేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. సురేష్ లాయర్ గా గుంటూరు లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.. రమాదేవి కి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని సురేష్ నమ్మబలికి 25 లక్షలు దాకా రమాదేవి నుండి కాజేశాడు. రమాదేవి ఇచ్చిన డబ్బులు కోసం సురేష్ తో గొడవ పడటంతో పథకం ప్రకారం రమాదేవి నీ సురేష్ మరియు అతని స్నేహితుడు కొల్లిపర శేఖర్ హత్య చేశారు శ్రీశైలం వెళ్దాం అనీ నమ్మబలికి రమాదేవి నీ పిలిపించి కర్రతో తలపై కొట్టి హత్యచేశారు. మృతదేహాన్ని సంఘం జాగరలమూడి కాలువలో పడివేసి వెళ్లిపోయారు. ముద్దాయిలు నేరం ఒప్పుకోవడంతో ఇద్దరు నిందితులను రిమాండ్ కి తరలిస్తున్నామని అన్నారు.

Latest News

బీజేపీ శ్రేణులు ధర్నా..... బీజేపీ శ్రేణులు ధర్నా.....
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23    ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో...
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....
ఘనంగా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం.....
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం.....
రోడ్డు ప్రమాదాలు జరగకుండా అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి..
నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..