నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..

నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..

ప్రజాస్వరం : నార్సింగి ,ఏప్రిల్ 22

 

నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి ఎంపీడీఓ చిన్నా రెడ్డి తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామాల పరిపాలన కొనసాగుతుందని వివరించడంతో పాటు, ఈ శిక్షణలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యం నిర్వహణ, నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీపీడీపీ) ద్వారా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన ఎలా అమలు చేయాలనే దానిపై కూడా మార్గదర్శనం చేస్తున్నామని పేర్కొన్నారు. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల వార్డు సభ్యులు ఈ శిక్షణలో పాల్గొంటుండగా, గ్రామ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఇంచార్జి ఎంపీడీఓ చిన్నా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Latest News

బీజేపీ శ్రేణులు ధర్నా..... బీజేపీ శ్రేణులు ధర్నా.....
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23    ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో...
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....
ఘనంగా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం.....
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం.....
రోడ్డు ప్రమాదాలు జరగకుండా అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి..
నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..