ఘనంగా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం.....

ఘనంగా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం.....

ప్రజాస్వరం : మేడ్చల్: ఏప్రిల్ 23

 

ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న అవంగపురం లక్ష్మిదేవి పదవీ విరమణ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఆర్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి,పీఆర్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్,పీఆర్ టీయూ జిల్లా అధ్యక్షులు రామేశ్వర్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి,వైస్ చైర్ పర్సన్ మేకల రజితదేవేందర్ రెడ్డిలు హాజరయ్యారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అవంగపురం లక్ష్మిదేవి వ్యాయమ ఉపాధ్యాయురాలుగా పూడూరు,జీడిమెట్ల, శ్రీరంగవరం గ్రామాల్లోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేశారని గుర్తు చేశారు.అదేవిధంగా ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరని తెలిపారు.వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పని చేస్తూ క్రీడల్లో ఎంతో మంది విద్యార్థులను జిల్లా,రాష్ట్ర స్థాయిలో ఎంపికయేందుకు కృషి చేశారని తెలిపారు.విద్యార్థులను శారీకంగా, మానసికంగా తయారు చేయడంలో వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మిదేవి కీలక పాత్ర పోషించారని కొనియాడారు.అనంతరం పలువురు ఉపాధ్యాయులు,పూర్వ విద్యార్థులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పీఆర్ టీయూ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి రజిత,హెచ్ ఎం రాజశేఖర్,కౌన్సిలర్లు ఓం ప్రకాష్ గౌడ్,దాది నర్సింహా,చిన్నోళ్ల భాస్కర్,సద్ది సురేష్ రెడ్డి,పూర్వ విద్యార్థులు మాజీ సర్పంచ్ బాబు యాదవ్,శ్రీకాంత్,

విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీజేపీ శ్రేణులు ధర్నా..... బీజేపీ శ్రేణులు ధర్నా.....
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23    ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో...
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....
ఘనంగా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం.....
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం.....
రోడ్డు ప్రమాదాలు జరగకుండా అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి..
నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..