కార్మికుల హక్కుల కోసమే మేడే దినోత్సవం...
వంటేరు ప్రతాప్ రెడ్డి ....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ , మే 1 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు జండా ఆవిష్కరణ లో పాల్గొన్నా మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆయన మాట్లాడుతూ...కార్మిక వర్గానికి అంతర్జాతీయ కార్మికుల 8 గంటల పని హక్కు కోసం జరిగిన పోరాటాలకు గుర్తుగా ప్రతి ఏటా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటారు ఆయన అన్నారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల త్యాగాలను స్మరించుకునే రోజు అని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు కార్మికులు పట్టణం లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ లు చెలిమల రాములు జైపాల్ రాథోడ్, బీఆర్ఎస్ నాయకులు కాశి రెడ్డి రఘుపతి చక్రవర్తి సతీష్ చారి, బుక్క విజయ్ చంద్ర శేఖర్ ,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
02 May 2026 14:54:49
ప్రజాస్వరం: తూప్రాన్ ,మే 2 : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ నూతన మార్కెట్ కమిటీ కి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో...


