దళిత రత్న అవార్డు పొందిన నల్ల నరేందర్, నల్ల శ్రీను .....

దళిత రత్న అవార్డు పొందిన నల్ల నరేందర్, నల్ల శ్రీను .....

ప్రజాస్వరం : ములుగు, ఏప్రిల్ 30  : 

 

మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం మాదిగ హక్కుల దండోరా ఇంచార్జ్ నల్ల నరేందర్, జిల్లా అసైన్డ్ భూముల సాధన అధ్యక్షులు నల్ల శ్రీను లకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో దళిత రత్న అవార్డును మాదిగ హక్కుల రాష్ట్ర అధ్యక్షులు సునీల్ మాదిగ, గౌరవ అధ్యక్షులు పెరుమాండ్ల రామకృష్ణ, జయంతి ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ రోజా రాణి ల చేతుల మీదగా ప్రధానోత్సవం చేశారు.మాదిగ సామాజిక వర్గానికి చేస్తున్న సేవలను గుర్తించి, తమకు ఈ అవార్డు ఇచ్చినట్లు నరేందర్, శ్రీను తెలిపారు.ములుగు మండలానికి చెందిన మమల్ని ఈ ఆవార్డుకు ఎంపిక చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు.ఈ సందర్బంగా వారు అవార్డు గ్రహీతలను పలువురు అభినందించి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రవి, గొంగటి రాజు, బొగ్గుల అశోక్, గొంగటి కృష్ణ,బొడ్డు లింగం, మన్నే రేగొండ తదితరులు పాల్గొన్నారు.

Latest News