తూప్రాన్ మున్సిపల్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు....

తూప్రాన్ మున్సిపల్ లో  బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు....

జండాలా ఆవిష్కరణ... మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని రవీందర్ గౌడ్... 

 

ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 27 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తెలంగాణా ప్రజల ఆశా జ్యోతి తొలి ముఖ్యమంత్రి పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్  పార్టీని స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26 వ సంవత్సరము లో అడుగుపెడుతున్న సందర్బంగా తూప్రాన్ పట్టణం లో మొదటి వార్డులో ఆవిర్భావ దినోత్సవ పార్టీ జండా ఆవిష్కరణ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని గౌడ్ ఆమె మాట్లాడుతూ... రాబోయే మూడేళ్ళ లో  బీఆర్ఎస్ పార్టీ అధికారం లోకి రావడం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని అభివృద్ధి కావలనంటే కేసీఆర్ రావాలని ఆమె కోరారు. తెలంగాణానను అన్నివర్గాలలో ముందుండి నడిపించిన పార్టీ  బీఆర్ఎస్ పార్టీ కావున ఈ రోజు  బీఆర్ఎస్ పార్టీ ఆవిర్బా వ దినోత్సవం సందర్బంగా తూప్రాన్ పట్టణం లో  బీఆర్ఎస్ పార్టీ జెండాను ప్రతి వార్డులో ప్రతి గ్రామం లో ఆవిష్కరించాలని పార్టీ ఆదేశాల తో అంతటా జండా లను ఆవిష్కరణ చేశారాని ఆమె పేర్కొన్నారు. మున్సిపల్ ఈ కార్యక్రమం లో చైర్ పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ , వైస్ చైర్ పర్సన్ సమత కాశి రెడ్డి కౌన్సిలర్లు చెలిమెల రాములు, సత్యలింగం, ఐలేష్ యాదవ్,నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.