దొంగగా మారిన బ్యాంకు మేనేజర్ ....

దొంగగా మారిన బ్యాంకు మేనేజర్ ....

బెట్టింగ్ డబ్బు కోసం ఫేక్ గోల్డ్ లోన్స్......

ఫేక్ గోల్డ్ లోన్స్, ఏటీఎం నగదు లో 179.54 లక్షల మోసం.....

ముగ్గురు నిందితులు రిమాండ్...

ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు....

 

ప్రజాస్వరం : మెదక్ ,మే 12 :  

 

బెట్టింగ్ డబ్బుల కోసం బ్యాంక్ మేనేజరే దొంగగా మారిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనా పై మంగళవారం మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ ప్రసన్నకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మెదక్ పట్టణంలో ఆదర్శ కో పరేటివ్ అర్బన్ బ్యాంకు మెదక్ బ్రాంచ్ లో 179.54 లక్షల మోసం కేసులో 3 నిందితులను పట్టుకోవడం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు యాదం అనిల్ మెదక్ ఆదర్శ ఆదర్శ కో. పరేటివ్ అర్బన్ బ్యాంకు మేనేజర్ గా పని చేస్తూ అతని భార్య, స్నేహుతులు, ఇతరుల ఆధార్, పాన్ కార్డు లు తీసుకుని ఆ పేపెర్ల మీద నకిలీ బంగారం పెట్టి సుమారు 1.49 లక్షల రూపాయలు 16 లోన్ లు తీసుకోవడం జరిగిందనీ అన్నారు. అంతే కాకుండా 2 ఏటీఎం ల నుండి నగదు ని డిపాజిట్ చేసేప్పుడు కొంత కొంత డబ్బులు పక్కన పెట్టి అలా సుమారు 31.35 లక్షలు నగదు ని కూడా మోస పూరితంగా బ్యాంకు ని మోసం చేశాడని అన్నారు. ఈ కేసులో శ్రీనివాస చారి నకిలీ బంగారం ని తనికి చేసి, ఒరిజినల్ అని చెప్పి బ్యాంకు ని మోసం చేసినందుకు అతన్ని, అనిల్ భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు అనిల్ పై గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ వేలేరుపాడు పోలీస్ స్టేషన్ పరిదిలో కూడా ఏపీ. గ్రామీణ వికాస్ బ్యాంక్, వేలేరుపాడు మండల్ బ్రాంచ్ లో కూడా పోలవరం నిర్వాసితులు, గిరిజనులను మోసం చేసి 11,82,487/- డబ్బులు వాడుకుని జైలు వెళ్ళాడని అన్నారు. పోలీస్ లు చేసిన విచారణ లో నిందితుడు అనిల్ గోల్డ్ లైన్స్ తీసిన డబ్బులు బెట్టింగ్ యాప్ లకు అలవాటు పడి డబ్బులు వినియోగించినట్టు భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు యాదం అనిల్ పరారీలో ఉన్నాడని అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. ప్రజలు బెట్టింగ్ యాప్స్ మోజులో పడి నేరాలకు పాల్పడకుండా సైబర్ క్రైమ్స్, బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పట్టణ సీఐ మహేష్ ను వారి సిబ్బందిని అభినందించారు.

Latest News

రోడ్డెక్కిన రైతులు.... రోడ్డెక్కిన రైతులు....
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం..  లారీలు పంపాలని రైతుల డిమాండ్...   ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 13 :  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి        మెదక్ జిల్లా చేగుంట మండలం...
దొంగగా మారిన బ్యాంకు మేనేజర్ ....
తూప్రాన్ సిఐగా వెంకట్రాజ్ గౌడ్ ....
విద్యార్థుల్లో క్రమశిక్షణ – సంస్కారం పెంపొందించాలి....
నిరక్షరాస్యత నిర్మూలన అమ్మకు అక్షరమాల ...
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు....
ఘనంగా ఇంటర్నేషనల్ నర్సింగ్ డే వేడుకలు ....