జ్యువేలర్ పాన్ బ్రోకర్ల యజమానులకు అవగహన...
ప్రజాస్వరం : తూప్రాన్, మే 5 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని మమతా మినీ ఫంక్షన్ హాల్లో జ్యువెలరీ షాపుల యజమానులు, పాన్ బ్రోకర్లు, గోల్డ్ వ్యాపారులు మరియు బ్యాంకు అధికారుల కోసం భద్రతా చర్యలపై పోలీసులు అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి విక్రాంత్ సింగ్ ,IPS అడిషనల్ ఎస్పీ మేదక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఇటీవల చోటుచేసుకుంటున్న దొంగతనాలు, దోపిడీలు మరియు మోసాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి జ్యువెలరీ షాప్, గోల్డ్ వ్యాపారి మరియు పాన్ బ్రోకర్ తప్పనిసరిగా ఆధునిక భద్రతా చర్యలు అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాలు హై క్వాలిటీతో ఏర్పాటు చేసి, నిరంతర రికార్డింగ్ మరియు బ్యాకప్ ఉండేలా చూడాలని, అలారం సిస్టమ్స్, సేఫ్టీ లాకర్స్ వినియోగం పెంచాలని అడిషనల్ ఎస్పీ తెలిపారు.అలాగే దుకాణాల్లోకి వచ్చే కస్టమర్ల వివరాలను సరిగా నమోదు చేయడం, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచడం, విలువైన బంగారం మరియు నగలను సురక్షితంగా నిల్వ చేయడం, బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్తలు పాటించడం, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పోలీస్ శాఖతో సమన్వయం పెంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ తూప్రాన్ నరేందర్ గౌడ్ , సీఐ తూప్రాన్ రంగా కృష్ణ , సీఐ నర్సాపూర్,జాన్ రెడ్డి సీఐ రామాయంపేట వెంకట్ రాజ్ గౌడ్ తూప్రాన్ సబ్‌డివిజన్‌కు చెందిన ఎస్ఐలు గంగారాజు చైతన్య రెడ్డి రాజు శివానందం లు పాల్గొన్నారు. జ్యువెలరీ షాపుల యజమానులు, పాన్ బ్రోకర్లు, గోల్డ్ వ్యాపారులు మరియు బ్యాంకు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై భద్రతా అంశాలపై అవగాహన పొందారు.కార్యక్రమం చివర్లో పాల్గొన్నవారి సందేహాలను నివృత్తి చేసి, భద్రతా చర్యలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులచే సూచనలు చేశారు.


