మేడ్చల్ లో డిగ్రీ కాలేజీ మంజూరుకు శ్రీకారం.....
మాజీ వైస్ ఛైర్మన్ శ్రీ చీర్ల రమేష్...
ప్రజాస్వరం : మేడ్చల్ ,మే 3 :
మేడ్చల్ ప్రాంత విద్యా అభివృద్ధికి మరో కీలక ముందడుగుగా, మేడ్చల్‌కు డిగ్రీ కాలేజీ మంజూరుకు శ్రీకారం చుట్టడం హర్షణీయమని మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ వైస్ ఛైర్మన్ శ్రీ చీర్ల రమేష్ అన్నారు.ఈ సందర్భంగా చీర్ల రమేష్ మాట్లాడుతూ మేడ్చల్ యువతకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో చేసిన ప్రయత్నాలు ఫలించి, డిగ్రీ కాలేజీ సాధన సాధ్యమైందని ,ఈ ప్రక్రియలో తెలంగాణ ఐటి శాఖ మంత్రి మరియు మెడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మార్గదర్శకత్వం, సహకారం ముఖ్యంగా నిలిచిందని, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి చొరవతో పాటు, డీసీసీ అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లిపెడ్డి సుధీర్ రెడ్డి , జాతీయ ప్రతినిధి శ్రీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ నక్క ప్రభాకర్ గౌడ్ చేసిన విశేష కృషితో ఈ కాలేజీ మంజూరుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.ఈ డిగ్రీ కాలేజీ ద్వారా మెడ్చల్ ప్రాంతంలోని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య స్థానికంగానే అందుబాటులోకి రానుందని ముఖ్యంగా ఇప్పటి వరకు మెడ్చల్‌లో డిగ్రీ కాలేజీ లేకపోవడంతో చదువు మధ్యలోనే ఆపివేసిన లేదా దూర ప్రాంతాలకు వెళ్లలేక విద్యను కొనసాగించలేకపోయిన బాలికలకు ఇది గొప్ప అవకాశంగా మారనుందని వారి విద్యాభ్యాసం కొనసాగేందుకు, భవిష్యత్తు నిర్మాణానికి ఇది బలమైన ఆధారంగా నిలుస్తుందన్నారు.ఇది కేవలం ఒక కాలేజీ స్థాపన మాత్రమే కాదు – ప్రాంతీయ విద్యా అభివృద్ధికి కొత్త దిశను చూపించే కీలక నిర్ణయని ఈ విజయానికి గిర్మాపూర్ మాజీ ఉప సర్పంచ్ శ్రీ బొక్క రఘుపతి రెడ్డి, ఐఎన్‌టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ కె. చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బండి శ్రీనివాస్ గౌడ్ మరియు మెడ్చల్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారం ఉందని గుర్తు చేశారు.ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మెడ్చల్ ప్రాంతాన్ని విద్యా రంగంలో మరింత అభివృద్ధి చేసే దిశగా ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలుస్తుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


