మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి 10 వేల జరిమానా...

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి 10 వేల జరిమానా...

ప్రజాస్వరం : మెదక్ ,మే 14 : 

 

ఈ నెల 12 న మెదక్ పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో బాబు లాల్ అనే వ్యక్తి కి మద్యం సేవించి వాహనం నడుపుతున్న నిర్ధారణ అవ్వడం తో గురువారం పట్టణ పోలీసులు మొబైల్ కోర్టు లో అతన్ని హాజరు పరచడం జరిగింది. ఈ క్రమంలో మొబైల్ కోర్టు జడ్జి సాయి ప్రభాకర్ మద్యం సేవించి వాహనం నడిపిన బాబు లాల్ కు 10 వేల జరిమానా విధించారు.