అనారోగ్యంతో ప్రభాకర్ మృతి వడదెబ్బతో కాదు..

డాక్టర్ రవికుమార్.....

అనారోగ్యంతో ప్రభాకర్ మృతి వడదెబ్బతో కాదు..

 

 

ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :

 

నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విషయం అవాస్తవమని మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై పీ.హెచ్.ఎన్ రేణుక, ఏ.ఎన్.ఎం కవిత లతో కలిసి మృతుడి నివాసానికి వెళ్లి దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. మృతుడు కొన్యాల ప్రభాకర్ గత వారం రోజులుగా దగ్గు, ఆయాసం తో అనారోగ్యానికి గురై ఇంటి వద్దే ఉన్నాడని, తగిన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించి గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. ప్రభాకర్ మృతికి వడదెబ్బ కారణం కాదని, అనారోగ్యంతోనే మరణించారని తమ విచారణలో తేలిందని, దీనికి సంబంధించిన నివేదికను పై అధికారులకు పంపించినట్లు మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు.

Latest News