ముప్పిరెడ్డిపల్లి లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు......
By Prajaswaram
On
ప్రజాస్వరం : మనోహరాబాద్: మే 22 :
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డి పల్లి గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ఏవో స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు.సేంద్రియ ఎరువుల వినియోగం,నేల ఆరోగ్యం పరిరక్షించుకోవడం,యూరియాను మోతాదుకు మించి వాడకుండా చూసుకోవడం,యూనివర్సిటీ యొక్క మెలకువలను వాడడం,భూసార పరీక్షలు చేసుకోవడం - వాటి వల్ల లాభాలు, యూనివర్సిటీ మరియు వ్యవసాయ శాఖ వారి సలహాలు, సూచనలతో పంటలు సాగుతో పాటు పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ డా" పుష్పవల్లి, తరుణ్ ,సర్పంచ్ రాజనర్సింహ, ఉప సర్పంచ్ రామ్ రెడ్డి, AMC డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, ఏఈఓ సచిన్, పాలకవర్గ సభ్యులు, నాయకులతో పాటు రైతులు పాల్గొన్నారు.
Latest News
22 May 2026 19:23:07
ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 : నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం


