ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య కళాశాల విద్యార్థుల ప్రభంజనం....

ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య కళాశాల విద్యార్థుల ప్రభంజనం....

ప్రజాస్వరం : మేడ్చల్ : మే 18 :

 

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు ఉత్తమ మార్కులు సాధించి తమ సత్తాను చాటుకున్నారు. త్రివిద్య కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ప్రభంజనం సృష్టించారు. కె.హర్షిత్ రెడ్డి 30వ ర్యాంకు, ఎం.ఎన్.ప్రద్యుమ్నారెడ్డి 115 వ ర్యాంకు, పి.శ్రీవిద్య 147 వ ర్యాంకు, ఇలా 37 మంది విద్యార్థులు 500 ర్యాంకు లోపు 94 మంది విద్యార్థులు 10000 ర్యాంకు లోపు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల చైర్మన్ పి.శ్రీధర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బోధన సిబ్బందిని తల్లిదండ్రులను ఆయన అభినందించారు. తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రణాళిక బద్ధమైన విద్యా బోధన ఆధునిక కాలానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేస్తూ విద్యాబోధన చేయడం మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ క్లాసుల నిర్వహణ చేస్తున్నామని, మా కళాశాల యందు నాణ్యమైన నిపుణులైన సిబ్బంది విద్యార్థులను ఎల్లవేళలా మార్గ నిర్దేశం చేస్తారని ఆయన తెలియజేశారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి తోడ్పడిన తల్లిదండ్రులను బోధన సిబ్బందిని మరియు విద్యార్థులను ఆయన అభినందించారు. రాష్ట్రస్థాయిలోనే కాక జాతీయ స్థాయిలోని పోటీ పరీక్షల్లో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు.

Latest News

ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం..... ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం.....
సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి..... ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మెదక్ జిల్లా ఎస్పీ...     ప్రజాస్వరం: మెదక్, మే 18  :      మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం...
రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు....
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి.... 
మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి...
ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే.... 
ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య కళాశాల విద్యార్థుల ప్రభంజనం....
సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.....