బేటి బచావో- బేటి పడవో నినాదంతో యువకుడి బైక్ యాత్ర...
ముఖ్య అతిథిగా హాజరైన సి ఐ సత్యనారాయణ....
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 22 :
బేటి బచావో- బేటి పడవో నినాదంతో మేడ్చల్ కు చెందిన యువకుడు దేశ వ్యాప్త బైక్ యాత్రకు శ్రీకారం చుట్టారు. మేడ్చల్ కు చెందిన యువకుడు డి.విష్ణువర్ధన్ నాగప్పా మోటార్స్ సౌజన్యంతో సుజికి యాక్సిస్ 125 వాహనం పై యాత్రకు శ్రీకారం చుట్టగా ముఖ్య అతిథిగా మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారయణ మేడ్చల్ లో యువకుడి యాత్రను శుక్రవారం నాగప్పా తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. యువకులు దేశం కోసం, బాలికల కోసం ఇలాంటి యాత్రలు చేసి అవగాహన కలిపించేందుకు యాత్ర చేయడం అభినంధనీయమని అన్నారు. బైక్ యాత్రను మేడ్చల్ నుండి సియాచిన్, సియాచిన్ నుండి కశ్మీర్, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నిర్వహిస్తున్నట్లు యాత్ర స్పాన్సర్ నాగప్ప తెలిపారు. 18రోజులు 7వేల కిలోమీటర్ల దూరం యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ కు చెందిన పలువురు యువకులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు నర్సింగ రావు గౌడ్, వెంకటేష్ గౌడ్, రమణారెడ్డి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.


