తెలంగాణ ఆవిర్బవ వేడుకలలో తూప్రాన్ గీతా స్కూల్ విద్యార్థుల....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్, జూన్ 2 :
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో మంగళవారం ఉదయం జరిగిన వేడుకల్లో తూప్రాన్ గీతా స్కూల్ విద్యార్థులు చక్కటి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తెలంగాణ వీరులను వారి త్యాగాలను స్మరించుకుంటూ సాగే ఈ గీతం అందరిని అలరించింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు చిన్నారులను ప్రశంసిస్తూ మెమెంటో అందజేశారు.ఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండెంట్ పి. రామాంజనేయులు, చైర్ పర్సన్ పి. ఉష, డైరెక్టర్లు భరత్, డాక్టర్ మౌనిక, రాఘవేందర్ గౌడ్, నారాయణ గుప్తా, ప్రిన్సిపాల్ అరుణ, ఇంచార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్ రాజ్ విద్యార్థులను అభినందించారు.
Latest News
02 Jun 2026 19:20:42
ప్రజాస్వరం : నార్సింగి ,జూన్ 02 : ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం...


