వెల్దుర్తిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు...

వెల్దుర్తిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు...

జాతీయ జెండా ఆవిష్కరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు...

 

ప్రజాస్వరం : వెల్దుర్తి : జూన్ 02 :

 

మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఎస్ఐ సాగర్, గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఆదర్శ్, మండల వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ విస్తరణ అధికారి అలీ మజీద్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అండ్ ఇంచార్జి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, గ్రామపంచాయతీ ఈఓ కృష్ణ, ఉపాధి ఫీల్డ్ మండల అధ్యక్షుడు బోయిన్ రాములు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెల్దుర్తి మండల ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. "ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. రాష్ట్ర ప్రగతి కోసం సమిష్టిగా కృషి చేద్దాం" అని పిలుపునిచ్చారు.*ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: తహసీల్దార్ విజయలక్ష్మి* ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని వెల్దుర్తికి నూతనంగా చార్జి తీసుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.మండలంలోని ప్రజలు రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తాం" అని తెలిపారు.మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేలా చర్యలు చేపడతామని, రైతులు పంటలను విక్రయించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఉద్యోగి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.