బీఆర్ఎస్ ప్రభుత్వం కోసం ప్రజల ఎదురుచూపు ....
పురం మహేష్ .....
ప్రజాస్వరం : మనోహరాబాద్ : జూన్ 05 :
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టి రాష్ట్ర అభివృద్ధిని మరింత పెంచాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేని లోటు నేడు ప్రజలకు తెలిసిందని ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరుతున్నారని అన్నారు. ప్రజలు నేడు అన్ని రంగాల్లో నష్టపోతున్నారని వారిని అన్ని విధాల ఆదుకునే నాయకుడు కేసీఆర్ ఒక్కడే నని అన్నారు. అనంతరం కాళ్లకల్ కు చెందిన స్వరూప రాణికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆమె కుమారుడికి అంద చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజశేఖర్ రెడ్డి, ఎండి ఆరిఫ్, జిల్లా ఉపసర్పంచల ఫోరం మాజీ అధ్యక్షులు రేణు కుమార్, పార్టీ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు ఇర్ఫాన్, నాయకులు బంగారి లు పాల్గొన్నారు.


