రామంతపూర్ తండాకు ‘రిక్వెస్ట్ బస్ స్టాప్’ మంజూరు ...
ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చొరవతో తీరిన తండావాసుల కష్టాలు....
మేడ్చల్ డీఎం ఆదేశాలు, సర్పంచ్ చందర్ నాయక్ కృతజ్ఞతలు....
ప్రజాస్వరం : మాసాయిపేట : జూన్ 04 :
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ తండా వాసుల బస్సు సమస్యకు పరిష్కారం లభించింది. గురువారం తండా సర్పంచ్ చందర్ నాయక్, ఉపసర్పంచ్, మాజీ ఎంపీటీసీ సోనీ శ్రీనివాస్ నాయక్ నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని కలిశారు.బస్సు సౌకర్యం లేక తండావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మేడ్చల్ డిపో డీఎంతో చరవాణిలో మాట్లాడి, రామంతపూర్ తండా వద్ద ‘రిక్వెస్ట్ బస్ స్టాప్’ ఏర్పాటు చేయాలని సూచించారు.వెంటనే స్పందించిన మేడ్చల్ డీఎం, తండాకు వెళ్లే దారిలో రిక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డు ఏర్పాటు చేయాలని సర్పంచ్ చందర్ నాయక్‌కు తెలిపారు. అంతేకాకుండా మేడ్చల్ డిపో డ్రైవర్లందరికీ వాట్సాప్ ద్వారా సందేశం పంపి, రామంతపూర్ తండా రిక్వెస్ట్ స్టాప్ వద్ద బస్సులు తప్పనిసరిగా ఆపాలని ఆదేశించారు.ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చొరవతో తమ చిరకాల సమస్య తక్షణమే పరిష్కారమైనందుకు సర్పంచ్ చందర్ నాయక్, ఉపసర్పంచ్, మాజీ ఎంపీటీసీ సోనీ శ్రీనివాస్ నాయక్, తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. సత్వరం స్పందించి సహకరించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మేడ్చల్ డీఎంలకు రామంతపూర్ తండా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


