క్రీడలను ప్రోత్సహిద్దాం.. మంచి విద్యార్థులను తయారు చేద్దాం ...

ఎంపి ఈటల రాజేందర్....

క్రీడలను ప్రోత్సహిద్దాం.. మంచి విద్యార్థులను తయారు చేద్దాం ...

 ప్రజాస్వరం, రంగారెడ్డి : జూన్ 04 :

 

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ -2026 ముగింపు ఉత్సవాల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గోన్నారు. విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ తో చేసిన గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకాలంలో పొద్దున్నుంచి రాత్రి దాకా చదువు తప్ప ఇంకోటి లేదు. అదొక్కటే సరిపోదు, సంపూర్ణత్వం ఇవ్వదు. విద్యార్థికి తనకాళ్ళ మీద తను నిలబడేలా విద్య ఉండాలి తప్ప.. మార్కులే పరమావధి కాకూడదు. అన్నిటినీ తట్టుకొని నిలబడే మానసిక స్థైర్యం అందించేవి క్రీడలు. ప్రభుత్వంతో పాటు అనేక మంది క్రీడాభిమానులు కలిసి ఈ క్యాంప్ నిర్వహించారు. కోచింగ్ ఇచ్చిన టీచర్లకు, ఓపికగా తీసుకువచ్చిన తల్లిదండ్రులకు, నిర్వాహకులకు, అధికారులకు నా హృదయపూర్వక అభినందనలు. మనం కనకూడని వినకూడని అనేక రుగ్మతలు వెంటాడుతున్నాయి.. వాటి నుంచి దూరం చేయగలిగిన సత్తా క్రీడలకు ఉంది. క్రీడలను ప్రోత్సహిద్దాం మంచి విద్యార్థులను తయారు చేద్దామని అన్నారు.

Latest News

రామంతపూర్ తండాకు ‘రిక్వెస్ట్ బస్ స్టాప్’ మంజూరు ... రామంతపూర్ తండాకు ‘రిక్వెస్ట్ బస్ స్టాప్’ మంజూరు ...
మేడ్చల్ డీఎం ఆదేశాలు, సర్పంచ్ చందర్ నాయక్ కృతజ్ఞతలు....   ప్రజాస్వరం : మాసాయిపేట : జూన్ 04 : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ తండా...
తూప్రాన్ మున్సిపల్ 1 వార్డు లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక  ....
తూప్రాన్ లో డ్రాంక్ అండ్ డ్రైవ్ లో ......
పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించండి.....
ప్రీ-ప్రైమరీ టీచర్లు, ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం....
క్రీడలను ప్రోత్సహిద్దాం.. మంచి విద్యార్థులను తయారు చేద్దాం ...
తెలంగాణ పోలీస్ అకాడమీ దేశంలోని అత్యుత్తమ పోలీసు శిక్షణా సంస్థలలో ఒకటి...