పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించండి.....
హెచ్ఎం సాంబయ్య .....
ఎల్కపల్లిలో ఇంటింటి ప్రచారం, ప్రభుత్వ విద్యపై అవగాహన....
ప్రజాస్వరం : వెల్దుర్తి : జూన్ 04 :
మెదక్ జిల్లా వెల్దుర్తి: పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ విద్యా సేవలను సద్వినియోగం చేసుకోవాలని వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పీఎం శ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య సూచించారు.వెల్దుర్తి మండల పరిధిలోని ఎల్కపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్యా సౌకర్యాలు తదితర అంశాలను వివరించారు.ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పించి అధిక ఫీజులతో ఆర్థిక భారం మోసుకోవద్దని, ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుబాటులో ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


