తాళం వేసిన ఉన్న ఇంట్లో చోరీ....
5తులాలు బంగారం , లక్ష యాభై వేలు, మాయం.....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్, జూన్ 7 :
పూర్ణారాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లక్ష్మీ నగర్ లో తాళం వేసిన ఇంట్లో దొంగల హల్చల్ చేశారు.లక్ష్మీ నగర్ లోని చంద్రమౌళి విద్యుత్ శాఖ ఉద్యోగి వారం రోజులుగా తిరుపతి తీర్థయాత్ర వెళ్లి శనివారం రాత్రి ఇంటికి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని ఇంట్లో వెళ్లి చూడగా బీరువా డ్రాలు తొలగించి అందులో ఉన్న సుమారు అయిదు తులాల బంగారు ఆభరణాలు తోపాటు 1,50,000 నగదును దొంగలించినట్లు చంద్రమౌళి తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీం తో విచారణ చేపట్టారు.
Latest News
07 Jun 2026 17:16:28
ప్రజాస్వరం : మేడ్చల్: జూన్ 07 : పవిత్ర మైన మృగశిరను పురస్కరించు కొని మేడ్చల్ జిల్లా కండ్లకోయ లోని సాయిగీత ఆశ్రమంలో ఉచిత ఆస్థమా వైద్య...


