ఘనం గా ప్రారంభం అయిన వన మహోత్సవం...

ఎంపీ రఘునందన్ రావు ....

ఘనం గా ప్రారంభం అయిన వన మహోత్సవం...

ప్రజాస్వరం : తూప్రాన్ : జూన్ 20 : 

పూర్ణరాజు గౌడ్ 

 

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన పేటలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన వన యోజన పార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా గుర్రం గూడ నుండి వర్చువల్ గా ప్రారంభించగా.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి అక్కన్నపేట వన యోజన పార్కును ప్రారంభించారు.అనంతరం నీడను ఇచ్చే మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు.పర్యావరణహితం కోసంప్రతీ ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు...అటవీ సంరక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా గుర్రం గూడాలో 17 కోట్లతో నిర్మించినపార్కు మినహా రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 11 పార్కులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు...11 పార్కులకు సంబంధించి అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కింద ఒక్కొక్క పార్కుకి రెండు కోట్ల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది అన్నారు. అక్కన్నపేటలో నిర్మించిన వన యోజన అర్బన్ పార్కు కు కోటి నలభై లక్షలు రూపాయలతో వివిధ రకాల పనులు చేపట్టడం జరిగింది అన్నారు.దీనికి భారత ప్రభుత్వానికి ఎంపీ రఘునందన్ రావు కృతజ్ఞతలు తెలిపారు..వెయ్యి ఎకరాల్లో ఉన్న ఈ పార్కును మరింత అభివృద్ధి చేయడానికి అటవీశాఖ అధికారులతో కలిసి నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు..ప్రతి ఒక్కరూ చెట్ల సంరక్షణ అనేది వంతుకు మొక్కలు నాటే కార్యక్రమంల కాకుండా.. భావితరాలను దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటాలన్నారు. ప్రస్తుతం సమాజంలో నీళ్ల బాటిల్ ను ఎలా పట్టుకొని తిరుగుతున్నామో భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్ ను పిల్లల వీపుకు వేసి పంపాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.. అందుకే ప్రతి ఒక్కరుఇంటిని సంరక్షించుకున్నట్టే ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణ హితం కోసం పాటుపడాలని కోరారు... మెదక్ నుంచి ఎల్కతుర్తి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారికి ఇరువైపులా జులై మొదటి వారంలో ఏకకాలంలో నేషనల్ హైవే అధికారులు,అన్ని గ్రామాల సర్పంచులు, యువత, జిల్లా అటవీశాఖ అధికారులు ఇతరులతో కలిసి 20వేల పండ్ల మొక్కలను నాటే కార్యక్రమం కోసం ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పాత మెదక్ రోడ్డుకు ఇరువైపులా ఏ విధంగా అయితే పెద్ద పెద్ద వృక్షాలు బాటసారులకు నిడనిచ్చాయో అదే తరహా మొక్కలు నాటుతామన్నారు..జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని తెలిపారు. శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో కృషి చేసి మొక్కలు నాటి సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. 2026 వనమహోత్సవంలో జిల్లాకు కేటాయించిన 31 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నర్సరీలలోని మొక్కల వివరాలను, ప్లాంటేషన్ చేసే సైట్ల రిజిస్ట్రేషన్, సంబంధిత వివరాలను కేటాయించబడిన ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని తెలిపారు. మొక్కలు నాటిన తర్వాత జియో ట్యాగింగ్ పూర్తి చేసి, రోజువారీగా వివరాలను నవీకరించాలని తెలిపారు. రహదారులకు ఇరుప్రక్కల పెద్ద చెట్లు నాటాలని, నాటిన ప్రతి ఒక్క మొక్క ఎదిగేలా సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల ఆవరణలో పూలు, పండ్ల మొక్కలు నాటాలని, జిల్లాలో గనులు దృష్ట్యా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని, ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటడం ద్వారా ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయని తెలిపారు.అంతకుముందు అక్కన్నపేట వన యోజన వన యోజన పార్కును ప్రారంభించిన అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించి మెదక్ ఎంపీ గారితో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు.అటవీ ప్రాంతంలో వనమహోత్సవం కార్యక్రమంలో , డిఎఫ్ఓ జో.జి , డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు, తాసిల్దార్ రజిని , ఎంపీడీవో , సర్పంచ్బి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.