రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది.....

పురం మహేష్ .....

రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది.....

 

 

.ప్రజాస్వరం : మనోహరాబాద్, జూన్ 20  :

 

రైతుల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తామని మనోహరాబాద్ మండల బీఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేష్ అన్నారు.ఆయన శనివారం మాట్లాడుతూ కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే పంటలు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం విచారకరమని ఈ నిర్ణయం తో లక్షల మంది రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేయగా, ప్రస్తుతం రైతులను సంక్షోభంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రైతులు పండించిన ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతే కేంద్రబిందువుగాపాలన సాగిందని అన్నారు. రైతు కుటుంబాలకు ఆడుకునేలా రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో నేరుగా లక్ష కోట్లకు పైగా జమ చేసి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఎన్నికల సమయంలో అన్ని పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు. పంటల కొనుగోళ్ల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తోందని ఆరోపించారు. గతంలో కేంద్రం కొనుగోలు చేయని పంటలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు.ఇప్పుడు కేంద్రం కోటా మేరకే కొనుగోలు చేస్తామనడం అత్యంత బాధాకరమని అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదని చెప్పారు. తెలంగాణ రైతులు పండించే ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.