ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంకుడు గుంత ఉండాలి......
మున్సిపల్ కమిషనర్ రమేష్.....
వర్షాకాలం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి....
ప్రజాస్వరం : తూప్రాన్ : జూన్ 8 :
పూర్ణారాజు గౌడ్ ప్రతినిధి:
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని నాలుగో వార్డు లో ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన లో భాగంగా నాలుగో వార్డ్ లోని ముదిరాజ్ సంఘం వద్ద నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్ జైపాల్ నాయక్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కౌన్సిలర్ మాట్లాడుతూ వర్షాకాలకు సీజన్లో ప్రజలు ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే మున్సిపాలిటీ నుంచి కావలసిన జాగ్రత్తలు ఆయన తెలిపారు. వార్డులోని వీధి దీపాలు బాగు చేయాలని అలాగే వర్షపు నీలు ఆగేచోట ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నూతన పింఛన్ దారులకు నూతన ఇందిరమ్మ ఇల్లు అర్హులందరికీ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ను కోరారు అలాగే మున్సిపల్ కమిషనర్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందరికీ అందే విధంగా కృషి చేస్తామని అలాగే వర్షాకాలపు నీళ్లు ఆగేచోట ముందు జాగ్రత్తలు చేపడతామని ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలందరూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని ప్రభుత్వ పాఠశాలలు అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రజా ప్రతినిధులు కూడా ప్రభుత్వ పాఠశాల చేర్పించాలని అప్పుడే ప్రభుత్వ విద్యా సంస్థపై నమ్మకం ఉంటుందని ప్రజలు కూడా ఆలోచించి కార్పొరేట్ స్కూల్లోకి వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి పంపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ మహేష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ప్రత్యూష వర్క్ ఇన్స్పెక్టర్ వేదాంత అంగన్వాడీ టీచర్ పద్మ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


