డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదు....

కేటీఆర్....

డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదు....

ఆషాఢం సేల్ లెక్క అడ్డగోలు హామీలు ఇచ్చుకుంటూ పోయారు..

 

ప్రజాస్వరం : మేడ్చల్ , ఏప్రిల్ 15 

 

మేడ్చల్ జిల్లా, పీర్జాదిగూడలో పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరే కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గోన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడూ పీర్జాదిగూడ నాయకులకు అభినందనలు. లోక్ సభ, శాసనసభ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఒక్కటి, చేసేది ఒక్కటి. డీలిమిటేషన్ పేరుతో బీజేపీ మరో కొత్త కుట్రకు తెరలేపుతోంది. మహిళలకు మేము స్థానికంగా ఉన్న మార్కెట్ కమిటీలలో 50శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. మహిళా రిజర్వేషన్ గురించి మేము శాసనసభలో కూడా తీర్మానం చేశాం. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదని అన్నారు.ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ లో అన్యాయం జరిగితే.. కేసీఆర్ అధ్యర్యంలో పోరాటం చేస్తాం. కేసీఆర్ స్వయంగా నాయకత్వం వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే ఉన్నది. అయినా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు . మన బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర యేండ్ల కాలం అయింది. ఎన్నికల ముందు అడ్డగోలుగా అనేక హామీలు ఇచ్చారు. పెద్ద పెద్ద మాటలు చెప్పి అడ్డం పొడుగు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మలేదు. ఒక్క సీటు కూడా వాళ్ళకు ఇవ్వలేదు. గ్రామాల్లో అమాయక ప్రజలు నమ్మి మోసపోయారు. అత్తకు రూ. 4000, కోడలికు రూ. 2500 ఇస్తాం అన్నారు. ఆషాఢం సేల్ లెక్క అడ్డగోలు హామీలు ఇచ్చుకుంటూ పోయారు. రేవంత్ మీరు ఇస్తామన్న స్కూటీలు ఎక్కడ? మహిళలకు ఇస్తామన్న రూ. 2500 ఎక్కడని అడిగితే.. ఎంత కండలు తిరిగిన పహిల్వాన్ అయినా మూడు నెలల్లో పిల్లలు పుట్టించరు కదా అంటాడు. అయ్యా ముఖ్యమంత్రి మూడు నెలలు కాలేదు.. 30 నెలలు అయింది. మరి ముప్పై నెలలు అయినా పుట్టకపోతే ఏం అంటారు? ఆడపిల్ల పుడితే 13వేలు, మగ పిలగాడు పుడితే 12వేలు ఇచ్చి తల్లి బిడ్డను ఇంటి దగ్గర దించి వచ్చేలా అనాడు మన కేసీఆర్ సంక్షేమ పథకాలు అందించారు. ఇవాళ రేవంత్ వచ్చి రెండున్నర యేండ్లు అయింది. అనేక కార్యక్రమాలు రద్దయ్యాయి. హైదరాబాద్ లో ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే ఇద్దరే ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఒక్కరు దొంగలు, మరొక్కరు దోమలు. హైదరాబాద్ లో ఎక్కడబడితే అక్కడ భూములు కబ్జాలు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరోపక్క ముఖ్యమంత్రి దోమలబాదు, దోమలగూడ అని పెట్టమని నేను అసెంబ్లీలో చెప్పాను. కేసీఆర్ ను బద్నాం చేసి అప్పులు పాలు చేసి తప్పించుకునే ఆలోచనలో రేవంత్ ఉన్నాడు. వాళ్లు తప్పించుకునే పరిస్థితి లేదు, వాళ్ళను కచ్చితంగా నిలదీయాలని అన్నారు.ఉప్పల్ ఫ్లై ఓవర్ భూమి పుట్టినప్పటి నుండి నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్. 8 ఏండ్లు అయింది. ఎక్కడ పని అక్కడే. మేము కడతాం అంటే.. లేదు లేదు మేమే కడతాం అన్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మూడుకు మూడు క్లిన్ స్వీప్ చేశారు. మళ్ళీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మనమే గెలుస్తాం ఇక్కడ సెప్టెంబర్ లేదా అక్టోబరులో ఎన్నికలు అంటున్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఇక్కడకు మళ్ళీ బుల్డోజర్ వస్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో కత్తి వాడికి ఇచ్చి పోరాటం మనము చేయాలి ఎలా? అందుకే ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయండి మీకు మేము అండగా ఉంటామని చెప్పండని అన్నారు. ..

Latest News

బీజేపీ శ్రేణులు ధర్నా..... బీజేపీ శ్రేణులు ధర్నా.....
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23    ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో...
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....
ఘనంగా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం.....
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం.....
రోడ్డు ప్రమాదాలు జరగకుండా అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి..
నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..