నాన్న హెల్మెట్ పెట్టుకో అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు...

నాన్న హెల్మెట్ పెట్టుకో అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు...

ప్రజాస్వరం  ; చిన్న శంకరంపేట,  ఏప్రిల్ 15

 

నాన్న హెల్మెట్ ధరించు అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు హెల్మెట్ పెట్టకుంటే నేను నీ బైక్ పై రాను అనే వినూత్న కార్యక్రమాన్ని చిన్న శంకరంపేట ఎస్సై నారాయణగౌడ్ చేపట్టారు, చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని మేరీమాత పాఠశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత వారోత్సవాలు పురస్కరించుకొని విద్యార్థులకు బస్సు డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించారు అదేవిధంగా నాన్న హెల్మెట్ పెట్టుకో అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు అని విద్యార్థులు తమ పాఠశాలలో నుండి వారి తల్లిదండ్రులకు పోస్ట్ కార్డు పంపించే విధంగా ఎస్సై నారాయణ గౌడ్ తనదైన శైలిలో వినూత్నంగా పోస్ట్ కార్డులను విద్యార్థులకు అందజేశారు, విద్యార్థులు తమ కుటుంబంలో వాహనాల్లో నడిపే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడి గాయాలు కాకుండా ఉండే విధంగా వారికి అవగాహన కల్పించారు, ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించే విధంగా చూసుకోవాలని హెల్మెట్ ఉంటేనే బైక్ పై వస్తానని వారికి సూచించాలని విద్యార్థులకు తెలిపారు, పాఠశాల సిబ్బంది ఎస్సై నారాయణ గౌడ్ శాలువాతో సన్మానించారు, ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహన కల్పించడం జరుగుతుందని ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కారు నడిపించేవారు సీటు బెల్టు ధరించాలని వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అతివేగం పనికిరాదని వేగం కన్నా ప్రాణం మిన్న అనే విధంగా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్సై నారాయణ గౌడ్ తో పాటు పాఠశాల సిబ్బంది జోసెఫ్ నేడిమేనాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

బీజేపీ శ్రేణులు ధర్నా..... బీజేపీ శ్రేణులు ధర్నా.....
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23    ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో...
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....
ఘనంగా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం.....
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం.....
రోడ్డు ప్రమాదాలు జరగకుండా అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి..
నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..