మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు.....

బీఆర్ఎస్.....

మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు.....

ప్రజాస్వరం  : హైదరాబాద్, ఏప్రిల్ 15 

 

మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాదికి అన్యాయం జరిగేలా ఉంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

కేటీఆర్, హరీష్ రావులతో భేటీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. తొలిసారి అధికారంలో ఉన్నప్పుడే అసెంబ్లీలో తీర్మనించామని గుర్తుచేసిన కేసీఆర్, ఆ బిల్లుకు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలపనున్నట్లు వెల్లడించారు. డీలిమిటేషన్ బిల్లులో పొందుపరిచిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే పార్టీ ఒక నిర్ణయానికి వస్తుందని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాదికి 24% ఎంపీ సీట్లు ఉన్నాయని, అంతకంటే తగ్గకుండా 50% పెంచాలని, 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కేసీఆర్ అభిప్రాయం. డీలిమిటేషన్ బిల్లు సమగ్రంగా పరిశీలించే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చారు. ఇదే క్రమంలో 20న జగిత్యాల సభ, 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.

Latest News

బీజేపీ శ్రేణులు ధర్నా..... బీజేపీ శ్రేణులు ధర్నా.....
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23    ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో...
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....
ఘనంగా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం.....
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం.....
రోడ్డు ప్రమాదాలు జరగకుండా అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి..
నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..