చెరువు కట్ట శ్రీ విరాంజనేయ స్వామి ఆలయంలో శని అమావాస్య శనీశ్వర స్వామి పూజ ....
పూజారి సలక ఆత్రేయ శర్మ ...
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 16 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లోని పెద్ద చెరువు కట్టపై స్వయంబు గా వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ విరాంజనేయ స్వామి ఆలయంలో శనివారం రోజు అమావాస్య వస్తే దానిని ''శని అమావాస్య'' అంటారు. ఇది శనిదేవుడి పూజకు అత్యంత విశేషమైన రోజు టైలా అభిషేకం .పూజ చేస్తే వచ్చే ఫలితాలుశని దోష నివారణ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వారికి ఉపశమనం లభిస్తుంది.అని ఆలయ పూజారి సలక ఆత్రేయ శర్మ తెలిపారు. శని వక్ర దృష్టి వల్ల వచ్చే అడ్డంకులు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.శని మహర్దశ, అంతర్దశ ప్రభావం తగ్గుతుంది ఆయన పేర్కొన్నారు. కర్మ ఫలితాలు శని దేవుడు కర్మకారకుడు. ఈ రోజు భక్తితో పూజిస్తే చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది న్యాయం, ధర్మం వైపు నడిపిస్తాడని సోమరితనం, బద్ధకం పోయి కష్టపడే తత్వం వస్తుంది పూజారి ఆత్రేయ శర్మ వివరించారు ఉద్యోగం, వ్యాపారం ఆటంకాలు తొలగి అభివృద్ధి కలుగుతుంద శని అమావాస్య రోజుతైలాభిషేకం: శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.హనుమాన్ పూజ శని బాధలు ఉన్నవారు హనుమంతుడిని పూజిస్తే శనీశ్వరుడు బాధించడు అని నమ్మకం.మనం చేసిన కర్మలకు ఫలితం ఇస్తాడు అంతే. భయపడకుండా భక్తితో, నిజాయితీగా పూజిస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడుఅని ఆత్రేయ శర్మ భక్తులు కు తెలియజేశారు.... ఆలయం లో ఆంజనేయస్వామి దాత్తత్రేయ సాయిబాబా సత్యనారాయణ స్వామి వినాయక నవగ్రహాలు శివాలయం కలిగిన ప్రసిద్ధ ఆలయంఅని ప్రతి శనివారం మంగళవారం లలో ప్రత్యేక పూజలు ఉంటాయని ఆయన అన్నారు.


