కొనుగోలు కేంద్రంలో సమస్యకు తక్షణ పరిష్కారం....

పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి ....

కొనుగోలు కేంద్రంలో సమస్యకు తక్షణ పరిష్కారం....

ధాన్యం తరలింపులో చురుగ్గా వ్యవహరించిన పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి ....

 

ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 15 : 

పూర్ణరాజు ప్రతినిధి 

 

శివంపేట్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీసుకొచ్చిన వడ్లు వాహనాల కొరత కారణంగా కేంద్రంలోనే నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రోజులు గడుస్తున్నా ధాన్యం తరలింపు జరగకపోవడంతో రైతుల్లో అసహనం వ్యక్తమైంది.ఈ సమస్యను గుర్తించిన శివంపేట్ పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి వెంటనే రంగంలోకి దిగారు. మండల పరిధిలో రహదారిపై వెళ్తున్న లారీ వాహనాలను ఆపించి, కొనుగోలు కేంద్రంలో నిలిచిపోయిన ధాన్యాన్ని సెంట్రల్ రైస్ మిల్లులకు తరలించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా ధాన్యం తరలింపునకు ఏర్పాట్లు చేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.సమస్య వచ్చిన వెంటనే స్పందించి రైతు పక్షాన నిలిచిన చింతల వెంకట్రాంరెడ్డి సేవాభావాన్ని రైతులు ప్రశంసించారు. “రైతు ఇబ్బంది అంటే తన ఇబ్బందిగా భావించి స్పందించిన నాయకుడు” అంటూ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, సొసైటీ సీఈవో గొల్ల మధు యాదవ్, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

అసత్య ఆరోపణలు మానుకోవాలి..... అసత్య ఆరోపణలు మానుకోవాలి.....
పార్టీ అభివృద్ధి కృషి చేయాలి... ఆలయ --చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్త    ప్రజాస్వరం : తూప్రాన్ ,మే15 : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి    మెదక్ జిల్లా...
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు.....
కొనుగోలు కేంద్రంలో సమస్యకు తక్షణ పరిష్కారం....
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి 10 వేల జరిమానా...
వివాహాతర సంబంధమే హత్య కు కారణం...
ఆదర్శ బ్యాంక్ మేనేజర్ అరెస్ట్.....
మేడ్చల్ పట్టణం లోని ప్రజల సమస్యలను పరిష్కరించాలి...