అసత్య ఆరోపణలు మానుకోవాలి.....
చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్త ...
పార్టీ అభివృద్ధి కృషి చేయాలి...
ఆలయ --చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్త
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే15 :
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని తూప్రాన్ మార్కెట్ కమిటీ ఏర్పాటుపై గజ్వేల్ ఇంచార్జ్ నర్సారెడ్డి ముడుపులు తీసుకున్నాడని అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకులు పిర్యాదు లు మానుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కమిటీ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా పేర్కొన్నారు రవీందర్ గుప్త మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ చురుకుతనంతో ఉండడంతో నాపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ ఇంచార్జ్ నర్సారెడ్డి నాచారం ఆలయ కమిటీ చైర్మన్ గా నియమించారని నన్ను ఎప్పుడు కూడా డబ్బులు అడగలేదని.. నర్సారెడ్డి డబ్బులు తీసుకుని పదవులు అమ్ముకుంటున్నారని అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకులు ఇంచార్జ్ లేని మరో వర్గాన్ని కొమ్ము కాస్తూ అధిష్టానం వద్ద ఫిర్యాదు చేస్తున్నారని ఇప్పటికైనా వాస్తవం తెలుసుకొని గజ్వేల్ ఇంచార్జ్ నర్సారెడ్డి తో సమావేశం ఏర్పాటు చేసుకొని రానున్న ఎన్నికల్లో జెడ్పిటిసి ఎంపీటీసీ పోటీ చేసి ప్రతిపక్షం తో పోరాటం చేయాలనీ ఆయన సూచించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేయడం వల్ల వచ్చేది ఏమీ లేదని పార్టీ నష్టపోతుందని ఆయన అన్నారు. పదవులు ఇస్తే మంచివాడని పదవి చేజారడంతో విమర్శించడం మంచి పద్ధతి కాదనిఆయన హెచ్చరించారు. పార్టీకి సేవ చేసే కార్యకర్తకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని కొత్త పాత అనే తేడా లేకుండా కొత్తవారు చేరితేనే పార్టీ అభివృద్ధి చెందుతుందని ఎవరు పదవికి అర్హత కలిగిన వ్యక్తులను గుర్తించి పదవులు కట్టబెడుతుందని ఓపికతో ఉంటే పార్టీలో పదవులు వస్తాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వయసులో చిన్న అయినా సీనియర్లు గౌరవించి సమర్థవంత పాలన అందించేందుకు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మామిళ్ళ కృష్ణ ముదిరాజ్, వెంకటేశం గుప్తా, శ్రీనివాస్ గుప్తా, జుక్కిడి ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ ,వెంకటేష్ ఉమ్మడి మండలంలోని సర్పంచులు కాంగ్రెస్ నాయకులు సుధాకర్ రెడ్డి, పురం రవి, యంజాల విట్టల్ రెడ్డి ,పెయింటర్ శ్రీనివాస్ భగవాన్ రెడ్డి శ్రీశైలం గౌడ్, జింక మల్లేష్ నాగరాజ్ గౌడ్, బొడ్డు వేణు రాము తదితరులు పాల్గొన్నారు.


