ఆర్థిక ఇబ్బందులతో యువకుడు.....

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు.....

ప్రజాస్వరం : నార్సింగి ,మే 15 :

 

ఆర్థిక ఇబ్బందులు, పంట నష్టం, మధ్యపాన వ్యసనం కారణంగా మనస్తాపానికి గురైన యువకుడు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక ఎసై సృజన తెలిపిన వివరాల ప్రకారం నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన దాయం నాగరాజు 32సం భార్య జానకి, ఇద్దరు కుమార్తెలతో కలిసి వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కురిసిన వడగళ్ల వానతో రెండెకరాల వరి పంట తీవ్రంగా దెబ్బతినడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యతో గొడవ పడి ఆమె పిల్లలను తీసుకుని అత్తమామల ఇంట్లో ఉండగా, శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చిన జానకి భర్త ఎంతకూ స్పందించకపోవడంతో తలుపు సందులోంచి చూడగా నాగరాజు హాల్లోని దూలానికి ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించింది. ఆర్థిక ఇబ్బందులు, మద్యం అలవాటు వల్ల జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని, తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest News

అసత్య ఆరోపణలు మానుకోవాలి..... అసత్య ఆరోపణలు మానుకోవాలి.....
పార్టీ అభివృద్ధి కృషి చేయాలి... ఆలయ --చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్త    ప్రజాస్వరం : తూప్రాన్ ,మే15 : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి    మెదక్ జిల్లా...
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు.....
కొనుగోలు కేంద్రంలో సమస్యకు తక్షణ పరిష్కారం....
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి 10 వేల జరిమానా...
వివాహాతర సంబంధమే హత్య కు కారణం...
ఆదర్శ బ్యాంక్ మేనేజర్ అరెస్ట్.....
మేడ్చల్ పట్టణం లోని ప్రజల సమస్యలను పరిష్కరించాలి...