అర్హులైన ప్రతి ఒక్కరికి గూడు కల్పిస్తాం...
మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి ...
వర్గల్ లో ఇందిరమ్మ నూతన గృహప్రవేశాలు
తెల్లరేషన్ కార్డుతో... ఇంటింటికి సన్న బియ్యం
పేదల సంక్షేమం...
కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ
గజ్వేల్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం):
పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కాగా, అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు వర్తింప చేస్తామని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వర్గల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ నూతన గృహప్రవేశాలు చేయించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
గజ్వేల్ నియోజకవర్గంలో 3 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళా సాధికారత లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించగా, మహిళల చేతుల్లోనే కుటుంబ ఆర్థిక స్థితిలో బాగుంటాయనే లక్ష్యంతో ప్రభుత్వ పథకాలను మహిళల పేరిటనే కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు పాత కార్డులలో సభ్యులను చేర్చి
సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాకుండా పంట రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి రూ 500 బోనస్ తదితర సాహసోపేత నిండాయాలతో పాటు గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, రూ 500కే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు వడ్డీ లేని రుణాలు తదితర అందజేస్తూన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్, వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్త, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షులు కడపల నర్సింహరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు బాల్రెడ్డి, నేతలు తవిటి కిష్టయ్య గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, అరవింద్ రెడ్డి, మహేందర్ గౌడ్, వహీద్, యాదయ్య యాదవ్, అయ్యగళ్ళ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


