నవోదయాలో ఫుట్బాల్ పంపిణీ...
విద్యార్థులు చదువు తో పాటు క్రీడాల్లో రాణించాలి.
మండల బిజెపి అధ్యక్షుడు తిరుపతిరెడ్డి
గజ్వేల్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం):
వర్గల్ నవోదయలో జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలోని ఎంపిక చేసిన విద్యార్థిని విద్యార్థులకు ఫుట్బాల్ పంపిణీ కార్యక్రమం జరిగిందని నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ దాసి రాజేందర్ తెలియజేశారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ మరియు FIFA (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్) సహకారంతో జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని విద్యాలయాలకు జిల్లా క్రీడా శాఖ అధికారి శ్రీ వెంకట నరసయ్య, బిజెపి మండల అధ్యక్షులు శ్రీ బొల్లిపల్లి తిరుపతి రెడ్డి మరియు మండల ప్రధాన కార్యదర్శి పంపరి రమేష్ ఆధ్వర్యంలో పంపిణీ జరిగిందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. మన దేశంలో ఇతర క్రీడలతో పాటు ఫుట్బాల్ కు కూడా ఆదరణ ఉండాలని ఆ క్రీడలో కూడా విద్యార్థిని విద్యార్థులు చక్కగా రాణించి తమ ప్రతిభ ప్రదర్శించి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని ఈ క్రీడల ముఖ్య ఉద్దేశం అన్నారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చిన బొల్లిపల్లి తిరుపతి రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ మన భారత ప్రభుత్వము ,మన పార్లమెంట్ వర్యులు రఘునందన్ రావు,క్రీడలకు ఎంతో ప్రోత్సహిస్తున్నారని విద్యార్థిని విద్యార్థులకు పరిపూర్ణ వికాసానికై చక్కటి కార్యక్రమాలను రూపొందిస్తూ వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. ఈ క్రీడలో విశేషంగా రాణిస్తూ ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం అనంతరము విద్యార్థిని విద్యార్థుల మధ్య ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఫుట్బాల్ గ్రౌండ్లో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆడారు.


