పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం....
జిల్లా అధ్యక్షుడు వల్దాస్ రాధా మల్లేష్ గౌడ్...
By Prajaswaram
On
పీఎంఏవై కింద రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు....
మెదక్, సెప్టెంబర్ 23 (ప్రజాస్వరం) :
మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. పేద ప్రజలందరికీ సొంత నివాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. పీఎంఏవై ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన ఇళ్లను అర్హులైన పేదలకు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కల్కి నాగరాజు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్, సర్పంచ్ వీణ, కౌన్సిలర్ లు పబ్బ రాజమణి, ఇప్ప అఖిల భరత్, మహిళ మోర్చా అధ్యక్షులు పట్లోళ్ల మల్లికా, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు గ్యాన్సింగ్, జిల్లా కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Latest News
23 Sep 2026 18:46:39
ప్రజాస్వరం,మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుల బావి చౌరస్తాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చౌరస్తా సమీపంలో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన...


