గుర్తు తెలియని మృతదేహం....
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్:
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుల బావి చౌరస్తాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చౌరస్తా సమీపంలో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన వివరాలు, పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ వ్యక్తి ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Latest News
23 Sep 2026 18:46:39
ప్రజాస్వరం,మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుల బావి చౌరస్తాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చౌరస్తా సమీపంలో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన...


