SGFI జోనల్ క్రీడల్లో సంస్కార్ విద్యార్థుల సత్తా...

SGFI జోనల్ క్రీడల్లో సంస్కార్ విద్యార్థుల సత్తా...

23 మంది విద్యార్థులు జోనల్ స్థాయికి ఎంపిక...

(ప్రజాస్వరం),మేడ్చల్:

దుందిగల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) ఆధ్వర్యంలో దుందిగల్‌లో నిర్వహించిన 70వ మేడ్చల్ జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో సంస్కార్ ఇన్నోవేటివ్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కోకో, కబడ్డీ, వాలీబాల్ విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో పాఠశాలకు ఘనత తీసుకొచ్చారు.అండర్-17 కోకో బాలుర విభాగంలో, అండర్-17 వాలీబాల్ బాలుర విభాగంలో, అండర్-14 వాలీబాల్ బాలుర విభాగంలో సంస్కార్ జట్లు ప్రథమ స్థానాలు సాధించగా, అండర్-17 కబడ్డీ బాలుర విభాగంలో ద్వితీయ స్థానం సాధించాయి. వివిధ క్రీడా విభాగాల్లో మొత్తం 23 మంది విద్యార్థులు జోనల్ స్థాయికి ఎంపికయ్యారు.విజేతలను, ఎంపికైన క్రీడాకారులను పాఠశాల కరస్పాండెంట్ బీరం వెంకటేశ్వర రెడ్డి అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన వివిధ ఇంటర్-స్కూల్ క్రీడా పోటీల్లోనూ సంస్కార్ విద్యార్థులు పలు బహుమతులు సాధించారని పేర్కొన్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే వివిధ క్రీడా పోటీల్లో తొమ్మిది బహుమతులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థుల విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు ఏ. నరేంద్ర బాబు, మల్లారెడ్డి, ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు. పాఠశాల యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల కృషితో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు.

Latest News

మేడ్చల్ విద్యుత్తు అధికారుల నిర్వాకం ... మేడ్చల్ విద్యుత్తు అధికారుల నిర్వాకం ...
ప్రజాస్వరం,మేడ్చల్ :   మేడ్చల్ పట్టణంలో కొంత మంది విద్యుత్ అధికారుల పనితీరు విమర్శలకు తవిస్తుంది.అయిన వారికి అరటి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అన్న చందంగా తయారయింది.పట్టణంలో...
ఇస్లాంపూర్‌లో వ్యక్తి  ....
SGFI జోనల్ క్రీడల్లో సంస్కార్ విద్యార్థుల సత్తా...
బాధిత కుటుంబానికి ఆర్థిక సహయం ...
విమోచన దినోత్సవ వేడుకల్లో సరస్వతి ట్రస్ట్....
త్యాగాల స్ఫూర్తితో సమైక్యతను కాపాడుకుందాం....
విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ....