మేడ్చల్ మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..

రాకేష్ కుమార్‌కు 'బెస్ట్ టీచర్' అవార్డు....

మేడ్చల్ మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..

 

 

ప్రజాస్వరం,మేడ్చల్ :

ప్రతినిధి:వెంకట్ 

మేడ్చల్ మండల్ ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్‌లోని హైటెక్ వాల్యూ రెసిడెన్షియల్ హైస్కూల్‌లో ఈ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో శ్రీ వివేకానంద హైస్కూల్ ఉపాధ్యాయులు దుందిగళ్ళ రాకేష్ కుమార్ 'బెస్ట్ టీచర్' పురస్కారాన్ని అందుకున్నారు.మేడ్చల్ మండల విద్యాశాఖాధికారి (MEO) వై. శంకరయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ బి. శ్రీధర్, ఎన్.ఎల్.కె. రామేశ్వర్ రెడ్డిలతో పాటు జి. హనుమంత్ రెడ్డి, పి. గిరిబాబు, జి.ఎల్.వి. నారాయణమూర్తి, రాధాకృష్ణ, ఎం. స్వామి దాస్, జోసెఫ్, సి. శ్రీనివాసులు రెడ్డి తదితర ప్రముఖులు అతిథులుగా పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి యొక్క గొప్పతనాన్ని, సమాజ నిర్మాణంలో మరియు విద్యారంగానికి ఉపాధ్యాయులు అందిస్తున్న అమూల్యమైన సేవలను కొనియాడారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడంతో పాటు వారి సేవలను అభినందించారు.

Latest News

మేడ్చల్ మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.. మేడ్చల్ మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..
        ప్రజాస్వరం,మేడ్చల్ : ప్రతినిధి:వెంకట్  మేడ్చల్ మండల్ ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్‌లోని హైటెక్ వాల్యూ
'సేవా సంకల్ప అభియాన్’ వర్క్‌షాప్....
మేడ్చల్‌లో గుర్తు తెలియని వ్యక్తి.....
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం పుణ్యం...
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన...
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన...
తునికి ఖల్సాలో స్టిక్కీ ట్రాప్స్ ఏర్పాటు.....